News August 27, 2024
తెలుగు రైల్వే ప్రాజెక్టులకు భారీ నిధులు
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ నిధులు కేటాయించింది. రాయలసీమలోని జిల్లాల్లో కేటాయించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, తుముకూరు నూతన మార్గానికి రూ.250 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కంబదూరు రైల్వే స్టేషన్ పరిధిలో కూడా పలు అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంది.
Similar News
News September 16, 2024
అనంతపురంలో క్రికెటర్ల ఫుడ్ మెనూ ఇదే!
అనంతపురంలో ఉంటున్న భారత క్రికెటర్లు ఆంధ్రా ఇడ్లీ రుచి చూస్తున్నారు. టమాటా బాత్, సాంబార్ ఇడ్లీని ఇష్టంగా తింటున్నారట. కోడిగుడ్డు, బ్రెడ్ ఆమ్లేట్, మొలకెత్తిన పెసలు, శనగలు వంటివి అల్పాహారంలో తీసుకుంటున్నారు. మధ్యాహ్నం, రాత్రి మూడు రకాల చికెన్ వంటకాలను మెనూలో ఉంచగా క్రికెటర్లను మటన్ బిర్యానీకి దూరంగా ఉంచారు. ప్లేయర్లు ఉదయం 8లోపే టిఫెన్ చేసి గ్రౌండ్‌కు వెళ్తున్నట్లు బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు.
News September 16, 2024
అనంతపురంలో కిలో టమాటా రూ.33
అనంతపురం జిల్లాలో టమాటా కిలో రూ.33 పలుకుతున్నట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రాంప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని కక్కలపల్లి టమాటా మార్కెట్లో గరిష్ఠంగా రూ.33తో క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్నారు. దాదాపు 2,250 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయని తెలిపారు. ఇక కిలో సరాసరి ధర రూ.25, కనిష్ఠ ధర రూ.17గా ఉందని వివరించారు.
News September 16, 2024
ATP: పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పారని యువకుడి ఆత్మహత్య
ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురానికి చెందిన విజయ్ కుమార్ మేనమామ కుమార్తెను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని యువతి ఇంట్లో సంప్రదించగా కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ్ పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ సర్వజన ఆసుపత్రిలో మృతి చెందాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.