News October 21, 2024

తెలుగు వర్సిటీ వీసీగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు

image

తెలుగు యూనివర్సిటీ వీసీగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని వర్సిటీలో ఆయన 12వ వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నిత్యానందరావు మాట్లాడుతూ.. తెలుగు యూనివర్సిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. సిబ్బంది సహకారంతో వర్సిటీని ప్రగతిపథం వైపు తీసుకెళ్లేలా శ్రమిస్తానని అన్నారు. నూతన వీసీకి రిజిస్ట్రార్‌ ఆచార్య రమేశ్ బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ గెలుపుపై కూనంనేని హర్షం

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. విజ్ఞతతో ఓటు వేసిన ఓటర్లకు ఆయన ధన్యావాదాలు తెలియజేశారు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌‌సభ నియోజకవర్గ పరిధి అయిన జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో BJP అభ్యర్థికి డిపాజిట్‌ గల్లంతయ్యిందన్నారు.

News November 14, 2025

జూబ్లీ తీర్పు: MP కావాలి.. MLA వద్దు!

image

MP ఎన్నిక, అసెంబ్లీ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 65 వేల ఓట్లు వేసి కిషన్ రెడ్డి గెలుపులో కీలకంగా మారారు. అదే ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు. దీపక్ రెడ్డికి మద్దతుగా కిషన్ రెడ్డి గల్లీ గల్లీ తిరిగినా 17 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. గత GHMC ఎన్నికల్లో ఇదే ఓటర్లు BRSను ఆదరించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలు పార్టీలను చూసి ఓటేస్తున్నారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: నిరుద్యోగి యువతి అస్మాకు 107 ఓట్లు

image

కాంగ్రెస్‌ను ఓడిస్తేనే తమకు సీఎం రేవంత్ రెడ్డి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తారని చెబుతూ ప్రచారం చేసిన నిరుద్యోగ యువతి, స్వతంత్ర అభ్యర్థి అస్మా బేగంకు 0.05 శాతం అంటే 107 ఓట్లు పోలయ్యాయి. గెలుపు కోసం కాదు నిరుద్యోగుల వాయిస్‌ను కాంగ్రెస్ ప్రభుత్వానికి వినిపించాలనే తాను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తానని చెప్పిన అస్మాకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.