News August 3, 2024

తెల్లపూర్: అభివృద్ధి పనులను సమీక్షించిన ఎంపీ

image

తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు శనివారం సమీక్షించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో ఆర్గానిక్ ప్రోడక్ట్ స్టాల్‌ను సందర్శించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.

Similar News

News September 7, 2024

MDK: మూడు రోజులు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలలో ఆదివారం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతుందని ఐఎండి హెచ్చరించింది.

News September 7, 2024

సిద్దిపేట జిల్లాలో దారుణం.. చెత్తకుప్పలో శిశువు

image

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సిద్దిపేట మెదక్ రహదారి పక్కన అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. తిమ్మాపూర్ గ్రామ శివారులోని గోదాంల వద్ద చెత్తకుప్పలో పడవేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆస్పత్రికి తరలించారు.

News September 7, 2024

నర్సాపూర్: చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన అశోక్ మృతదేహం బయటపడింది. శుక్రవారం చేపల వేటకు వెళ్లిన అశోక్ చెరువులో గల్లంతయ్యారు. నర్సాపూర్ ఫైర్ సిబ్బంది కే ప్రశాంత్, నాగరాజు, మధు, రమేశ్, వెంకటేశ్‌లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం తరలించారు.