News August 20, 2024
తేడావస్తే సుప్రీం కోర్టుకు వెళ్తా: బాలినేని

ఒంగోలులో సోమవారం జరగాల్సిన మాక్పోలింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి బాలినేని స్పందిస్తూ.. తాను వెరిఫికేషన్ ఉంటుందని అనుకున్నానని, మాక్ పోలింగ్ కాదని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్కు లెటర్ ఇచ్చామని అలాగే హైకోర్టుకు వెళ్లామన్నారు. కోర్టు ఇవాళ్టికి వాయిదా వేశారన్నారు. హైకోర్టులో ఏదైనా తేడాలు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తానని బాలినేని స్పష్టం చేశారు.
Similar News
News November 21, 2025
కొమరోలు: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

కొమరోలు మండలం తాటిచెర్ల విద్యుత్ శాఖ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న ఎం.బీకోజీ నాయక్ (42) గుండె పోటులో మృతి చెందారు. ఇతని స్వగ్రామం పుల్లలచెరువు గ్రామం కాగా తాటిచర్ల విద్యుత్ లైన్మెన్గా కొన్ని ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొమరోలు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News November 21, 2025
సమస్యల పరిష్కారానికి.. ఈ వేళల్లో సంప్రదించండి: డీఈవో

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని దినాలలో తన కార్యాలయం వద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంఈవోలు తమ కార్యాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ విషయాన్ని ఎంఈవోలు గమనించాలని కోరారు.