News December 25, 2024

తైక్వాండోలో సింగరాయకొండ విద్యార్థినికి గోల్డ్ మెడల్

image

ఢిల్లీలో జరిగిన నేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన  ఇంటర్ విద్యార్థిని లీలామైత్రిని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మంగళవారం సింగరాయకొండలో  అభినందించారు. లీలామైత్రి సింగరాయకొండలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా లీలామైత్రి చక్కని ప్రతిభ చూపడం గర్వనీయమని అభినందించారు

Similar News

News January 22, 2025

ప్రకాశం జిల్లాలో ప్రమాదాలకు నిలయంగా.. కట్టెల లోడ్లు.!

image

ప్రకాశం జిల్లాలో ప్రమాదాలకు నిలయంగా కట్టెల లోడ్లు తయారవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏటా 7నెలలు పొగాకు కాలం నడుస్తుంది. జనవరి-ఏప్రిల్ మధ్య పొగాకు కాల్పు దశకు వస్తోంది. ఈ సమయంలో రైతులు కర్రల లోడ్లు తీసుకెళ్తుంటారు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. <<15219057>>నిన్న జరిగిన<<>> కట్టెల లోడు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. <<15167553>>ఈనెల 16న<<>> పచ్చాకు లోడుతో వెళ్తుండగా ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలపై మీ కామెంట్.

News January 22, 2025

ప్రకాశం: తమ్ముడి మృతి.. 12 ఏళ్లకు అన్నకు ఉద్యోగం

image

మరణించిన తమ్ముడి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద ఆయన అన్నకి ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన నావూరి రామకృష్ణ మరణానంతరం 12 ఏళ్ళ తరువాత రామకృష్ణ అన్న ఏడుకొండలుకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చారు. మంగళవారం ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఏడుకొండలుకు ఉత్తర్వుల్ని ఇచ్చారు.

News January 22, 2025

ఒంగోలు రానున్న వందేమాతరం శ్రీనివాస్‌ 

image

అక్కినేని నాగేశ్వరరావు 11వ వర్ధంతి కార్యక్రమాన్ని 22వ తేదీ ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అక్కినేని కళాపరిషత్ అధ్యక్షుడు కళ్ళగుంట కృష్ణయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా  సంగీత దర్శకుడు వందేమాతరం. శ్రీనివాస్‌కు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు -2025ను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే హాజరవుతారని తెలిపారు.