News January 28, 2025
తొండంగి గ్యాస్ సిలిండర్ల గోడౌన్లో చోరీ

మండలం కేంద్రం తొండంగి గ్రామంలో వైష్ణోదేవి గ్యాస్ ఏజెన్సీ గోడౌన్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల వివరాలు ప్రకారం 96 డొమెస్టిక్ సిలిండర్లు అపహరణకు గురైనట్టు నిర్వాహకుడు వడ్డాది ప్రసాద్ పేర్కొన్నాడు. వాటి విలువ 3.5 లక్షలు ఉంటుందని నిర్వహకుడు ప్రసాద్ సోమవారం అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై జగన్మోహన్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసామని ఘటనపై దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు.
Similar News
News December 25, 2025
అమరావతి రైల్వే లైన్.. మరో 300 ఎకరాల సేకరణ

ఎరుపాలెం-అమరావతి-నంబూరు బ్రాడ్ గేజ్ లైన్ పనుల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 300 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీరుల్లపాడు, కంచికచర్ల మండలాల్లోని 8 గ్రామాల్లో ఈ భూమిని సేకరించనున్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములు ఉన్నాయి. 56.53 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు అమరావతికి రైలు మార్గం కల్పించడంలో కీలకమని అధికారులు అంటున్నారు.
News December 25, 2025
ఇతిహాసాలు క్విజ్ -107 సమాధానం

ఈరోజు ప్రశ్న: తన పరమ భక్తుడిని రక్షించడం కోసం ఓ దేవుడు ఒకే సమయంలో అటు మనిషిగా కాకుండా, ఇటు జంతువుగా కాకుండా సగం మానవ, సగం మృగం రూపాన్ని ధరించాడు. ఆ దేవుడెవరు? ఆయన ఎవరిని రక్షించారు?
సమాధానం: ఆయన శ్రీమహావిష్ణువు ధరించిన నరసింహ అవతారం. తన భక్తుడైన ప్రహ్లాదుడిని తండ్రి హిరణ్యకశిపుడి క్రూరత్వం నుంచి కాపాడటానికి స్వామి ఈ రూపం దాల్చారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 25, 2025
బిజినేపల్లి: ఆలయ అర్చకునిపై దాడి

బిజినేపల్లి మండలంలోని పాలెంలో అభయ ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడు ఖానాపురం సురేష్ శర్మపై అకారణంగా దాడి జరగింది. ఆలయ స్థలదాత రెడ్డి వెంకటేశ్వర రెడ్డి తనపై దాడి చేశారని అర్చకుడు ఆరోపిస్తూ ఆలయ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. అర్చకుడికి మద్దతుగా గ్రామ యువకులు తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


