News February 28, 2025
తొండింగి: పీక కోసుకొని యువకుడి ఆత్మహత్య

తొండింగి మండలంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తమ్మయ్య పేటలో భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భర్త పీక కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాలు.. కిర్లంపూడి(M) రామచంద్రపురానికి చెందిన కుందేటి లోవరాజు (28) భార్య నాగలక్ష్మికి తరచూ గొడవలు నేపథ్యంలో మనస్థాపం చెంది ఇంటిపై వాటర్ ట్యాంకు వద్ద పీక కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
Similar News
News October 29, 2025
ఖమ్మం: పత్తి మార్కెట్‌కి సెలవు

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డుకు నేడు (బుధవారం) సెలవు ప్రకటించినట్లు మార్కెట్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. అపరాలు, మిర్చి కొనుగోళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. పత్తి క్రయవిక్రయాలు తిరిగి ఈ నెల 30న గురువారం పునఃప్రారంభమవుతాయని తెలిపారు. పత్తి విక్రయానికి రానున్న రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News October 29, 2025
NLG: రెచ్చిపోతున్న కుక్కలు.. పట్టించుకోరే..!

నల్గొండ జిల్లాలో కుక్కల దాడి ఘటనలు జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప తర్వాత పట్టించుకోవడం లేదని పట్టణ, పల్లె ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అటు మున్సిపల్ సిబ్బంది గానీ, ఇటు గ్రామపంచాయతీ సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా నల్గొండ నాలుగో వార్డులో 11 మందిపై కుక్కలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి.
News October 29, 2025
‘మొంథా’ విజృంభిస్తోంది.. సెలవులు ఇవ్వండి!

మొంథా తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, నంద్యాలతో పాటు పలు జిల్లాల్లో నిన్నటి నుంచే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ సెలవు ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తోంది. భారీ వర్షాల ముప్పు ఉండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా తుఫాన్ తీవ్రత తగ్గే వరకూ సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.


