News February 16, 2025
తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి ఎంపీ

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆదివారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ప్రాణ నష్టం జరగడం అత్యంత బాధాకరంగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.పది లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించిందని అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
Similar News
News December 1, 2025
అమరావతిలో ‘క్వాంటం’ విప్లవం.. 50వేల మందికి శిక్షణ

అమరావతిని గ్లోబల్ క్వాంటం హబ్‌గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ‘అమరావతి క్వాంటం మిషన్’ను ప్రారంభించింది. WISER, Qubitech సహకారంతో 50 వేల మంది విద్యార్థులు, నిపుణులకు క్వాంటం టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనున్నారు. డిసెంబర్ 8న ప్రారంభం. ఫేజ్-1: ఫౌండేషన్ కోర్సు ఫీజు రూ.500. ఫేజ్-2: ఇందులో ప్రతిభ చూపిన టాప్ 3 వేల మందికి అడ్వాన్డ్స్ శిక్షణ పూర్తిగా ఉచితం. దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
News December 1, 2025
KMM: గుర్తుల కేటాయింపులో అభ్యర్థులకు టెన్షన్!

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
News December 1, 2025
వేములవాడ: పార్వతీపురం- ఆలయంవైపు వాహనాలకు NO ENTRY

వేములవాడ పట్టణంలోని పార్వతీపురం నుంచి భీమేశ్వరాలయంవైపు వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో నటరాజ విగ్రహం పరిసరాల్లో భక్తుల సంచారం ఎక్కువ అవుతోంది. పార్వతీపురం నుంచి వచ్చే భక్తుల వాహనాలతో మరింత ఇబ్బందిగా మారింది. దీంతో ఈ ప్రాంతం నుంచి భీమేశ్వరాలయంవైపు వాహనాలు రాకుండా అన్నదాన సత్రం వద్ద ప్రత్యేకంగా గేటు ఏర్పాటు చేశారు.


