News February 16, 2025
తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి ఎంపీ

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆదివారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ప్రాణ నష్టం జరగడం అత్యంత బాధాకరంగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.పది లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించిందని అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
Similar News
News March 21, 2025
NRPT: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి: ఎస్పీ

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, శరీరాన్ని దృఢంగా మారుస్తాయని ఎస్పీ యోగేశ్ గౌతం అన్నారు. నారాయణపేట ఎస్పీ పరేడ్ మైదానంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ కోర్టు, వాలీబాల్ కోర్టును ప్రారంభించారు. అనంతరం కాసేపు వాలీబాల్, క్రికెట్ ఆటలను ఆడారు. పోలీసులు విరామ సమయంలో క్రీడలు ఆడేందుకు వీలుగా మైదానాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్ పాల్గొన్నారు.
News March 21, 2025
సంగారెడ్డి: అత్తను కొట్టిన అల్లుడికి జైలు శిక్ష

అత్తను కొట్టిన అల్లుడికి జైలు శిక్ష పడిన ఘటన మునిపల్లి మండలంలో చోటుచేసుకుంది. పుల్కల్ SI క్రాంతి తెలిపిన వివరాలు.. పుల్కల్‌కు చెందిన పూజితకు మునిపల్లి మండలం తక్కడపల్లికి చెందిన గొల్ల కృష్ణకు 2019 పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. తాగుడికి బానిసైన కృష్ణ 2023లో అత్త, భార్యపై దాడి చేశాడు. అత్త చంద్రకళకు తీవ్ర గాయాలై కొన్ని నెలలు కోమాలో ఉంది. పరారీలో ఉన్న కృష్ణను గురువారం రిమాండ్‌కు తరలించారు.
News March 21, 2025
నార్నూర్ వాసికి CM ద్వారా నియామకపత్రం

నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ సూరజ్ సింగ్-ప్రణీత దంపతుల కుమారుడు బానోత్ సోను సింగ్ ఇటీవల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఉద్యోగ నియామకపత్రాన్ని అందజేసి అభినందించారు. కార్యక్రమంలో వేణుగోపాల్, బంజారా నాయకులు పాల్గొన్నారు.