News July 3, 2024
తొర్రూరు: అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు

ప్రేమ పేరుతో బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. డివిజన్ కేంద్రానికి చెందిన ఓ బాలికపై వాటర్ ప్లాంట్లో పనిచేసే ఇనుగుర్తి గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని ఎస్సై తెలిపారు.
Similar News
News January 9, 2026
మే 3న నీట్.. సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం

జిల్లాలో మే 3న జరగనున్న నీట్-2026 (యూజీ) పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాలపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ఈ నెల 15 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌వో విజయలక్ష్మీ, నోడల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
News January 9, 2026
వరంగల్: 5 కొత్త లేఅవుట్లకు అనుమతి

కొత్త లేఅవుట్ల ఏర్పాటుకు జిల్లా లేఅవుట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఐదు లేఅవుట్లకు తుది అనుమతులు మంజూరు చేశారు. పైడిపల్లి, దేశాయిపేట, స్తంభంపల్లి, నక్కలపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న లేఅవుట్లను పరిశీలించి ఆమోదం తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు
News January 9, 2026
వరంగల్ జిల్లాలో సరిపడా యూరియా ఉంది: కలెక్టర్

వరంగల్ జిల్లాలోని యాసంగి 2025- 26 పంటల సాగుకు సరిపడా యూరియా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ యాసంగి పంటకు 19770 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, 9770 మెట్రిక్ టన్నుల జనవరి మాసంలో రైతులకు అవసరం మేరకు అందించడం జరుగుతుందన్నారు.


