News March 24, 2025

తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

image

సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్‌లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News November 20, 2025

HNK: ‘బాలల హక్కుల పరిరక్షణకు సమన్వయం అవసరం’

image

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలలు దేశ సంపద అని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ అని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించి, వారిని అభినందించి బహుమతులు అందించారు.

News November 20, 2025

MHBD: నిబంధనలు అతిక్రమిస్తే చర్యలే: డీఎంహెచ్‌వో

image

మహబూబాబాద్ జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో డీఎంహెచ్‌వో (DMHO) రవి రాథోడ్ పలు ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి ఉంటేనే చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ల వారు ప్రతి నెల 5వ తేదీలోపు ఫామ్-ఎఫ్లను ఆరోగ్యశాఖ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు.

News November 20, 2025

నాబార్డ్ ఎర్త్ సమ్మిట్‌లో Dy.CM భట్టి, మంత్రి తుమ్మల

image

హైదరాబాద్ హైటెక్స్‌లో నాబార్డ్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఎర్త్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నాబార్డ్ ఛైర్మన్ షాజీ, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గోవర్ధన్ సింగ్ రావత్ తదితర ప్రముఖులు హాజరై పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.