News February 5, 2025

తొర్రూరు: వైద్యం వికటించి యువకుడు మృతి

image

తొర్రూరు మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాలు.. వైద్యం వికటించి సిద్ధూ(16) మృతి చెందాడు. జలుబు వస్తుందని ఆసుపత్రికి వెళ్తే ఇంజెక్షన్ వేశారని, ఆ వెంటనే సిద్దు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు డెడ్ బాడీతో ఆస్పత్రిలోనే ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 24, 2025

MDK: కర్నూలు బస్సు ప్రమాదం.. కేసీఆర్ ఆరా

image

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న కొందరూ సజీవ దహనమై మృతి చెందడం పట్ల ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

News October 24, 2025

KNR: విద్యార్థులకు పోలీసు భద్రతా అవగాహన

image

పోలీసు అమర వీరుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఇవాళ పోలీసు పరేడ్ గ్రౌండ్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ పనితీరు, డిపార్టుమెంట్‌లో ఉపయోగించే ఆయుధాలు, సాంకేతిక పద్దతులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిరు.

News October 24, 2025

మార్కాపురంలోకి శ్రీశైలం?.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు

image

AP: ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో శ్రీశైలాన్ని కలిపేలా అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. నంద్యాల(D) కేంద్రానికి శ్రీశైలం దూరంగా ఉండటంతో స్థానికుల నుంచి వినతులు వచ్చినట్లు సమాచారం. మార్కాపురానికి శ్రీశైలం 80 కి.మీ. దూరంలో ఉండగా, నంద్యాల-శ్రీశైలం మధ్య 165 కి.మీ దూరం ఉంది. మరోవైపు అద్దంకిని బాపట్ల(D) నుంచి తిరిగి ప్రకాశం(D)లో విలీనం చేసే ప్రతిపాదనలూ ఉన్నట్లు సమాచారం.