News March 22, 2025
తొర్రూర్‌లో బాలికకు అబార్షన్!

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మైనర్ బాలికకు గర్భస్రావం చేసిన ఘటన తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాలు.. దంతాలపల్లి మం.కి చెందిన ఓ బాలిక గర్భం దాల్చడంతో ఆస్పత్రికి తీసుకురాగా అబార్షన్ చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితుడిపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Similar News
News March 25, 2025
భీమదేవరపల్లి: తెల్లవారుజామున యాక్సిడెంట్.. ఒకరి మృతి

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్- ఎల్కతుర్తి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కనకపూడి కర్ణాకర్ అనే పాస్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 25, 2025
కొత్త క్యాబినెట్.. వరంగల్‌కు దక్కని అవకాశం!

మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈసారి ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ అంశంపై ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే సీతక్క, సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు. కాగా WGL జిల్లాకు చెందిన MLA, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తనకు మంత్రి పదవి కావాలని పార్టీ పెద్దలను పలుమార్లు కలిశారు. కానీ ఆయన పేరు కూడా లిస్టులో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నట్లు తెలిసింది.
News March 25, 2025
రైతులకు ఇబ్బందులు లేకుండా వసతులు: కలెక్టర్

వరంగల్ పట్టణ పరిధిలోని జీఏం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమావేశంలో పాల్గొనే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.