News March 22, 2025
తొర్రూర్లో బాలికకు అబార్షన్!

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మైనర్ బాలికకు గర్భస్రావం చేసిన ఘటన తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాలు.. దంతాలపల్లి మం.కి చెందిన ఓ బాలిక గర్భం దాల్చడంతో ఆస్పత్రికి తీసుకురాగా అబార్షన్ చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితుడిపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Similar News
News November 16, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* ఎర్ర చందనం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు డ్రోన్లతో పహారా కాస్తున్నట్లు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు DSP మహేంద్ర తెలిపారు. మరో 8 మంది నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
* గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కు ఐదేళ్ల తర్వాత విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
News November 16, 2025
HYD: కల్తీ టీ పొడి ఇలా గుర్తించండి!

నగరంలో కల్తీ టీ పొడిని గుర్తించలేని పరిస్థితి. అలాంటి సమయంలో నీళ్లలో ఒక దుకాణంలో తెచ్చిన టీ పొడి, మరో దుకాణంలో తెచ్చిన టీ పొడిని ఒక గ్లాసులో వేయండి. రంగు తేడా వచ్చిందా..? వెంటనే 040-21111111 ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి దైవ నిధి తెలిపారు. ప్రజలు కల్తీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News November 16, 2025
మరో అల్పపీడనం.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు APSDMA తెలిపింది. ఈనెల 17, 18 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.


