News March 22, 2025
తొర్రూర్లో బాలికకు అబార్షన్!

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మైనర్ బాలికకు గర్భస్రావం చేసిన ఘటన తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాలు.. దంతాలపల్లి మం.కి చెందిన ఓ బాలిక గర్భం దాల్చడంతో ఆస్పత్రికి తీసుకురాగా అబార్షన్ చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితుడిపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Similar News
News November 12, 2025
HYD: రేపే ఫీజు చెల్లింపు లాస్ట్..!

HYD డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019- 2024 మధ్య చేరిన డిగ్రీ 1st, 3rd ఇయర్ విద్యార్థులు ఇంకా ట్యూషన్ ఫీజు చెల్లించని వారు NOV 13లోపు చెల్లించొచ్చని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే 2022- 2024 మధ్య MA, MCom, MSc అడ్మిషన్ పొందిన వారూ 2nd ఇయర్ ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చని వివరించారు. పూర్తి వివరాలకు www.braouonline.inను సందర్శించండి.
News November 12, 2025
HYD: 50 మందికి కార్నియా మార్పిడి.. కొందరు వెయిటింగ్

HYDలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి దాదాపు 50 మందికి కార్నియా మార్పిడి చేసి కొత్త జీవితం ప్రసాదించినట్లు తెలిపారు. మరో 50 మంది వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. తాజాగా ఆర్టీసీతో ఆస్పత్రి ఒప్పందం కుదుర్చుకోగా గ్రామీణ ప్రాంతాల్లో స్వీకరించిన కార్నియాలను సరోజిని దేవి ఆస్పత్రికి తరలిస్తున్నారు.
News November 12, 2025
విచారణకు పూర్తి స్థాయిలో సహకరించా: ధర్మారెడ్డి

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీబీఐ సిట్ రెండో రోజు 8 గంటలపాటు విచారించింది. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరించినట్లు ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. ‘అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పా. గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారులందరినీ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే నన్నూ విచారించారు’ అని మీడియాకు తెలిపారు.


