News June 3, 2024

తొలిఫలితం తేలేది కొవ్వూరు, నరసాపురంలోనే..!

image

అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. అత్యల్పంగా 13 రౌండ్స్ ఉండటంతో ఇక్కడే త్వరగా ఫలితం వెల్లడికానుంది. రంపచోడవరం ఫలితం చివరగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి, నరసాపురం ఎంపీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలో ఫలితం వెల్లడి కానుండగా.. అమలాపురం ఎంపీ నియోజకవర్గంలో అత్యధికంగా 27 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది.

Similar News

News September 16, 2024

‘ఏలూరు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ’

image

స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ 2024 నిర్వహించనున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను మన జీవన విధానంగా మార్చుకునేలా సమష్టిగా ముందడుగు వేయవలసిన అవశ్యకత ఉందన్నారు. జిల్లా స్థాయిలో భాగస్వామ్య సంస్థలతో ఇప్పటికే ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించామన్నారు.

News September 15, 2024

ఏలూరు జిల్లాలో విషాదం.. భార్యాభర్తల మృతి

image

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం.. తణుకు మండలం పిట్లవరం గ్రామానికి చెందిన వారు ఏడేళ్లుగా వెంకటాపురంలో నివాసం ఉంటున్నారు. కాగా భార్యను పీక నులిమి, భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి జంగారెడ్డిగూడెం DSP రవిచంద్ర చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

పల్నాడులో యాక్సిడెంట్.. ఏలూరు జిల్లావాసులు మృతి

image

పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు మరణించారు. SI బాలకృష్ణ తెలిపిన వివరాలు.. నిడమర్రు మండలానికి చెందిన కృష్ణ (31), రవి కిషోర్ (25) కారులో గుంటూరు వెళ్లారు. యడ్లపాడు వద్ద టైరు పంక్చర్ కాగా టైరు మారుస్తున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరోవ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదైంది.