News June 3, 2024
తొలిఫలితం తేలేది కొవ్వూరు, నరసాపురంలోనే..!

అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. అత్యల్పంగా 13 రౌండ్స్ ఉండటంతో ఇక్కడే త్వరగా ఫలితం వెల్లడికానుంది. రంపచోడవరం ఫలితం చివరగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి, నరసాపురం ఎంపీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలో ఫలితం వెల్లడి కానుండగా.. అమలాపురం ఎంపీ నియోజకవర్గంలో అత్యధికంగా 27 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది.
Similar News
News September 19, 2025
ఈనెల 20న కలెక్టరేట్లో జాబ్ మేళా: కలెక్టర్ కీర్తి

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో ఈ నెల 20న వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రముఖ కంపెనీలు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
News September 19, 2025
నేడు ఉద్యోగుల పీజీఆర్ఎస్ కార్యక్రమం

ప్రతి నెల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ను నేడు నిర్వహించనున్నారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని PGRS హాల్లో సాయంత్రం 4 గంటలకు ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమం జరగనుందని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగుల PGRS కార్యక్రమానికి అన్ని శాఖల అధిపతులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
News September 18, 2025
యూరియా తగినంత ఉంది కలెక్టర్ కీర్తి

జిల్లాలో యూరియా కొరతపై వ్యాపించిన వదంతులను నివృత్తి చేయడానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామాన్ని సందర్శించారు. దొమ్మేరు ప్యాక్స్ వద్ద రైతులు, అధికారులతో ఆమె మాట్లాడారు. జిల్లాలో యూరియా తగినంత నిల్వ ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.