News June 14, 2024

తొలిరోజు పాఠశాలలకు 63.75 శాతం హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో సుమారు 50 రోజుల సెలవులు అనంతరం గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాలు పాఠశాలలు మొత్తం 3,055 ఉండగా.. వీటిల్లో తొలిరోజు 63.75 శాతం మంది విద్యార్థులు బడులకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 2,57,274 మంది విద్యార్థులు చదువుతుండగా.. తొలి రోజు 1,32,949 మంది హాజరై, 76,330 మంది గైర్హాజరయ్యారని డీఈవో కే.వెంకటేశ్వరరావు వెల్లడించారు.

Similar News

News September 10, 2024

నష్ట నివేదికను 11న అందజేయాలి: కలెక్టర్ దినకర్

image

శ్రీకాకుళం జిల్లాలో వర్షాల కారణంగా నష్టం వాటిల్లిన వివరాలను 11వ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవానం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీ రాజ్, డీపీవో,ఆర్డబ్ల్యుఎస్, డ్వామా, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలలకు డేమేజ్ జరిగితే తక్షణమే మరమ్మతు పనులు చేయాలన్నారు.

News September 10, 2024

SKLM: అడ్మిషన్లకు ఈనెల 19లోగా దరఖాస్తు చేసుకోండి

image

దేశవ్యాప్తంగా ఉన్న మిలిటరీ స్కూల్ లలో 6,9 తరగతుల్లో చేరేందుకు ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి శైలజ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. అప్లై చేసిన వారికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తామని అన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు www.rashtriyamilitaryschools.edu.in వెబ్ సైట్ ను సంప్రదించాలని కోరారు.

News September 10, 2024

SKLM: 15 మంది ఎస్సైలకు బదిలీ

image

శ్రీకాకుళం జిల్లాలో 15 మంది ఎస్.ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్వరరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది సీఐలకు బదిలీలు కాగా, అందులో ఇద్దరిని శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారు. ప్రస్తుతం విశాఖపట్నం వీఆర్‌లో ఉన్న వి.నాగరాజును శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీసుస్టేషన్, జి.ఆర్.కె. తులసీదాసు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి బదిలీ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.