News February 6, 2025
తొలిరోజు ప్రశాంతంగా ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు
జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమై 11 కేంద్రాల్లో మొదలైన ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆర్‌ఐఓ డాక్టర్ ఎస్ శ్రీనివాసులు అన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించడం జరిగిందన్నారు. 39 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు
Similar News
News February 6, 2025
ఉదయగిరి: సీనియర్ అధ్యాపకుడు గుండెపోటుతో మృతి
ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో పలు కళాశాలల్లో పనిచేసిన సీనియర్ అధ్యాపకుడు బి శ్రావణ్ కుమార్ ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. గత రాత్రి దాసరిపల్లిలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి భోజనం తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో ఉదయగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News February 6, 2025
నెల్లూరు: కోనేరులో యువకుడి గల్లంతు
ఇందుకూరు పేట మండలంలోని గంగపట్నం చాముండేశ్వరీదేవి అమ్మవారి ఆలయ ఆవరణలో ఉన్న కోనేరులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. నరుకూరుకు చెందిన కృష్ణతేజ(20), తన భార్య శ్రావణి, ఇంటి పక్కన ఉన్న ముత్యాలు, మునెమ్మ అనే దంపతులతో కలిసి అమ్మవారి దర్శనం కోసం బుధవారం వెళ్లారు. ఈ క్రమంలో కృష్ణతేజ కోనేరులో దిగి గల్లంతయ్యాడు. సమచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
News February 5, 2025
రైతులకు కనీస మద్దతు ధర లభించేలా పర్యవేక్షించాలి: కలెక్టర్
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం ఆయన కార్యాలయంలో వ్యవసాయం అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా త్వరలో మొదలుకానున్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర దక్కేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.