News January 28, 2025
తొలిరోజే జిల్లా ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాదవ్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. సోమవారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో 75 ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి, సకాలంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.
Similar News
News November 5, 2025
చేలో కూలీలతో కలిసి కలుపు తీసిన పల్నాడు జిల్లా కలెక్టర్

రాజుపాలెం(M) రాజుపాలెంలో బుధవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పర్యటించారు. సహజ సిద్ధంగా సాగు చేస్తున్న చామంతి, మిర్చి, బొప్పాయి తోటలను పరిశీలించారు. మిర్చి పంటలో జిల్లా కలెక్టర్ కూలీలతో కలిసి కలుపు తీసి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి విధానంలో పండిన కూరగాయలను పరిశీలించి రైతులకు సలహాలు ఇచ్చారు.
News November 5, 2025
ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని సాలూరు వంద పడకల ఆసుపత్రి.!

కోట్ల రుపాయలు వెచ్చించి నిర్మిస్తున్న సాలూరు వంద పడకల ఆసుపత్రి ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ప్రారంభంకు నోచుకోలేదు. వైద్య సేవలు అందించేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా వసతుల లేమితో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ చూసేందుకు సరిపడా గదులు లేక ఐదుగురు డాక్టర్లు ఒకేచోట ఉండి సేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ మీనాక్షి తెలిపారు. ఆసుపత్రి తొందరలో ప్రారంభం అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
News November 5, 2025
కరీంనగర్: అంజనాద్రి క్షేత్రంలో స్వామిపై సూర్యకిరణాలు

కరీంనగర్ పరిధి భగత్నగర్ గుట్టపై ఉన్న అంజనాద్రి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్భుత దృశ్యం కనిపించింది. బుధవారం ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు స్వయంభు హనుమాన్ విగ్రహంపై నేరుగా పడి భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఆలయ పూజారుల ప్రకారం ప్రతి ఏడాది ఈ పుణ్యదినాన ఇదే విధంగా సూర్యకాంతులు విగ్రహాన్ని తాకుతాయని తెలిపారు. ఇది దేవస్థాన నిర్మాణ శైలికి, ఆ స్థల పవిత్రతకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.


