News July 1, 2024
తొలిరోజే పింఛన్ 100 శాతం పంపిణీ పూర్తిచేయాలి: కలెక్టర్ సృజన

జులై 1వ తేదీన ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారులకు ఇళ్ల వద్దే అందించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సృజన ఆదేశించారు. ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద చేపట్టే సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలిరోజే 100 శాతం పంపిణీ పూర్తిచేసేలా కృషిచేయాలన్నారు.
Similar News
News November 23, 2025
మచిలీపట్నం: నాన్ వెజ్‌కు రెక్కలు.!

కార్తీక మాసం ముగియటంతో జిల్లాలో మాంసపు దుకాణాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. నెల రోజులపాటు మాంసాహారానికి దూరంగా ఉన్న ప్రజలు ఆదివారం మార్కెట్‌కు వెళ్లి తమకు ఇష్టమైన మాంసాహారం (చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు) కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల పాటు తగ్గిన మాంసాహారాల ధరలు ఆదివారం ఆమాంతం పెరిగిపోయాయి. కేజీ మటన్ రూ.900, చికెన్ రూ. 220, రొయ్యలు రూ.400ల వరకు అమ్ముతున్నారు.
News November 23, 2025
నేడు మచిలీపట్నంలో సత్యసాయి జయంతి వేడుకలు: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలను ఈనెల 23వ తేదీన జిల్లాలో అధికారిక వేడుకగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యాలయం వద్ద సాయంత్రం 5 గంటలకు జిల్లాస్థాయి వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో బాబావారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు.