News March 3, 2025

తొలి దళిత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగిది తూ.గో.జిల్లానే

image

తొలి దళిత లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన GMC బాలయోగి ఐ.పోలవరం(M) ఎదురులంకలో జన్నించారు. కాకినాడలో పోస్ట్ గ్రాడ్యుయేట్, విశాఖలో న్యాయ పట్టా పొందారు. 1980లో ఆయన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1987లో తూ.గో. ప్రజా పరిషత్ ఛైర్మన్‌గా, ముమ్మిడివరం నుంచి ఉపఎన్నికలో శాసనసభకు ఎన్నికయ్యారు. ఏపీలో విద్యామంత్రిగా నియమితులయ్యారు. 2002 మార్చి 3లో కైకలూరులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నేడు ఆయన వర్ధంతి.

Similar News

News December 4, 2025

తిరుపతి: డ్రంక్ అండ్ డ్రైవ్.. భారీ జరిమానా

image

తిరుపతి పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 31 మంది డ్రైవర్లకు 3వ అదనపు మేజిస్ట్రేట్ సంధ్యారాణి బుధవారం రూ.3,10,000 జరిమానా విధించారు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ DSP రామకృష్ణ చారి తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 25 మందికి రూ.500 చొప్పున రూ.12,500 జరిమానా విధించినట్లు తెలిపారు.

News December 4, 2025

జూనియర్ లెక్చరర్ల పరీక్ష ఫలితాలు విడుదల

image

AP: జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఇక్కడ <>క్లిక్<<>> చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16, 17 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పింది. అదే రోజు కంప్యూటర్ బేస్డ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తామని వెల్లడించింది. కాల్ లెటర్లు రానివారు అధికారిక వెబ్ సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జులై 15-23 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

News December 4, 2025

రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలలు: MP

image

రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలల ఏర్పాటు కేంద్ర పరిశీలనలో ఉందని కాకినాడ MP తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం పార్లమెంటులో తానడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సమాధానం ఇచ్చారని వెల్లడించారు. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా వీటి ఏర్పాటు పరిశీలిస్తున్నారన్నారు. తిరుపతి ఐఐటీకి రూ.25.28 కోట్లు ఇప్పటికే మంజూరైనట్లు మంత్రి తెలిపారని ఎంపీ వెల్లడించారు.