News March 3, 2025
తొలి దళిత లోక్‌సభ స్పీకర్ బాలయోగిది తూ.గో.జిల్లానే

తొలి దళిత లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన GMC బాలయోగి ఐ.పోలవరం(M) ఎదురులంకలో జన్నించారు. కాకినాడలో పోస్ట్ గ్రాడ్యుయేట్, విశాఖలో న్యాయ పట్టా పొందారు. 1980లో ఆయన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1987లో తూ.గో. ప్రజా పరిషత్ ఛైర్మన్‌గా, ముమ్మిడివరం నుంచి ఉపఎన్నికలో శాసనసభకు ఎన్నికయ్యారు. ఏపీలో విద్యామంత్రిగా నియమితులయ్యారు. 2002 మార్చి 3లో కైకలూరులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నేడు ఆయన వర్ధంతి.
Similar News
News March 21, 2025
బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని సింగర్ మనోను కోరిన కలెక్టర్

బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని జిల్లా కలెక్టర్ జె .వెంకట మురళి చేసిన విజ్ఞప్తి మేరకు ప్రముఖ గాయకులు (మనో)నాగుర్ బాబు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. చందోలు బంగ్లాముఖి దేవాలయానికి వెళ్తూ మార్గమధ్యంలో ఆయన కలెక్టర్ ను కలిశారు. వారివురూ 10 నిమిషాల పాటు జిల్లా గీతంపై చర్చించుకున్నారు. కలెక్టర్ కోరిక మేరకు బాపట్ల జిల్లా గీతాన్ని ఆలపించడానికి మనో అంగీకరించారు.
News March 21, 2025
పది వార్షిక పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది: KMR కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యయి. మొదటి రోజు ప్రశాంతంగా పరీక్ష జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కామారెడ్డిలోని గౌతమ్ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలోని తరగతి గదులను పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్ జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట కామారెడ్డి తహశీల్దార్ జనార్ధన్ ఉన్నారు.
News March 21, 2025
శ్రీశైలం ఘాట్‌రోడ్డులో నిలిచిన లారీ.. 5KMల ట్రాఫిక్ జామ్

AP: శ్రీశైలం ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఇసుక లారీ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తుమ్మలబైలు నుంచి శ్రీశైలం వరకు 5 కి.మీ మేర బస్సులు, కార్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు.