News April 19, 2024
తొలి రోజు ప్రకాశం జిల్లాలో 13 నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి జిల్లాలో నామినేషన్ లు ప్రారంభమయ్యాయి. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నలుగురు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 మంది నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. దర్శి అసెంబ్లీకి నలుగురు, ONG, కొండపి, గిద్దలూరు, కనిగిరి, SNపాడు నియోజకవర్గాలకు ఒక్కొక్కరు నామినేషన్ వేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వైపాలెం, MRKP అసెంబ్లీకి నామినేషన్ దాఖలు కాలేదు.
Similar News
News November 14, 2025
17న ఒంగోలులో కలెక్టర్ మీకోసం కార్యక్రమం

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన కలెక్టర్ మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గత సోమవారం కనిగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే 17వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే కలెక్టర్ మీకోసంలో ఆయన పాల్గొననున్నారు.
News November 14, 2025
17 నుంచి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం

ఈనెల 17వ తేదీ నుంచి చేపట్టే చర్మరోగ పరీక్షల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం ఒంగోలు ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏ రోగమైనా ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగిన జాగ్రత్తలు, వైద్యం అందించేందుకు వీలుగా ఉంటుందన్నారు.
News November 14, 2025
సెల్ ఫోన్ వద్దు – పుస్తకం ముద్దు: ప్రకాశం కలెక్టర్

విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి, పుస్తకాలకు చేరువ కావాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని శాఖ గ్రంథాలయంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాత, పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


