News March 21, 2025
తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

జిల్లాలో మొదటిరోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఈఓ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 8,627 మంది విద్యార్థులకు గాను మొదటి రోజు 8,616 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 11 మంది గైర్హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
Similar News
News November 24, 2025
సీఎం చదువుకున్న పాఠశాల, కళాశాల అభివృద్ధికి రూ.50 కోట్లు: ఎమ్మెల్యే

సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న పాఠశాల, కళాశాలను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.50 కోట్లతో నూతన భవనాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మించబోయే కొత్త ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం వనపర్తిలో ఉన్న చారిత్రక రాజభవనం నిర్మాణ శైలిని పోలి ఉంటుందన్నారు. రాబోయే సంవత్సరకాలంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
News November 24, 2025
AP న్యూస్ రౌండప్

* నెల్లూరు మేయర్ స్రవంతిపై 40 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ జేసీ వెంకటేశ్వర్లుకు నోటీసును అందజేశారు.
* డిప్యూటీ సీఎం పవన్ ఏలూరు(D)లో పర్యటిస్తున్నారు. కాసేపట్లో జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.
* విజయనగరం(D)గుర్లలో స్టీల్‌ప్లాంట్ వద్దంటూ పలు గ్రామాల రైతులు ఆందోళనలు చేపట్టారు. ముందు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 24, 2025
విశాఖలో హోంగార్డు అనుమానాస్పద మృతి.!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న హోంగార్డు బి.కృష్ణారావు (56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం కూరగాయల కోసం బయటకు వెళ్లిన ఆయన కాసేపటికే విశాఖలోని 104 ఏరియా రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించారు. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.


