News May 12, 2024
తోటకూర గింజలతో తల్లి బిడ్డల చిత్రం

ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాకవరపాలెం మండలం, తూటిపాల గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు రవికుమార్ అద్భుతాన్ని సృష్టించాడు. 624 తోటకూర గింజలతో తల్లీబిడ్డల చిత్రాన్ని రూపొందించాడు. చిత్రం మధ్యలో అమ్మ గురించి, గొప్పతనం తెలుపుతూ సూక్ష్మ లిపిలో రాశాడు. ఇలా రూపొందించడానికి తనకు 10 గంటల సమయం పట్టినట్లు ఆయన తెలిపారు.
Similar News
News December 25, 2025
స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం

జీవీఎంసీ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిందని అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి తెలిపారు. జీవీఎంసీ హాల్లో సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆపరేషన్ లంగ్స్ లో దుకాణాలు తొలగింపు చేయడం జరిగిందని, విశాఖను అందంగా తీర్చిదిద్దేందుకు రూ.1425 కోట్లతో 250 దుకాణాలను మొదటి ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి జోన్లో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక అన్ని జరుగుతాయని తెలిపారు.
News December 25, 2025
విశాఖలో పబ్ నిర్వాహకులకు సీపీ వార్నింగ్

విశాఖపట్నం నగరంలోని బార్, పబ్ నిర్వాహకులతో పోలీస్ కమిషనర్ సమావేశం నిర్వహించారు. ధ్వని కాలుష్యం, అక్రమ పార్కింగ్, డ్రగ్స్ వాడకం, మైనర్లకు మద్యం సరఫరాపై సీపీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిర్ణీత సమయపాలన పాటించాలని, సిబ్బందికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రతే తమ ప్రాధాన్యతని ఆయన పేర్కొన్నారు.
News December 25, 2025
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు: సీపీ

విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో నగరవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ.. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. బహిరంగ మద్యపానం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.


