News July 25, 2024

తోటపల్లి ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితి

image

తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 105 మీటర్లు కాగా.. 104.10 మీటర్ల వరకు నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తి 2,139 క్యూసెక్కుల నీటిని కిందకి విడిచిపెడుతున్నట్లు వెల్లడించారు. రెండు కాల్వల ద్వారా 210 క్యూసెక్కుల సాగునీటిని పంట పొలాలకు అందిస్తున్నామని తెలిపారు.

Similar News

News November 1, 2025

సహాయక చర్యల్లో విజయనగరం జిల్లా ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన భక్తులను ఆసుపత్రులకు తరలించి, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర రెడ్డితో కలిసి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.

News November 1, 2025

సిబ్బందికి విజయనగరం ఎస్పీ కీలక ఆదేశాలు

image

కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు, పిక్నిక్ స్పాట్స్ వద్ద తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అధికారులకు శనివారం ఆదేశించారు. భక్తులు పోలీసు సూచనలు పాటించాలని కోరారు. అవసరమైతే డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి, క్యూలైన్‌లు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని ఎస్పీ తెలిపారు.

News November 1, 2025

విజయనగరంలో బిర్సా ముండా జయంతి వేడుకలు

image

విజయనగరం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా జన జాతీయ గౌరవ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, గాం గంటం దొర, పండు పడాల్ వంటి నాయకుల త్యాగాలను స్మరించారు. విద్యార్థులతో మెగా ర్యాలీ, మొక్కలు నాటడం, ఆటల పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 15న జరిగే మెగా ఈవెంట్‌కు సిద్ధంగా ఉన్నామని గిరిజన సంక్షేమ అధికారి తెలిపారు.