News March 21, 2025

తోటపల్లి రిజర్వాయర్లో యువకుడి మృతదేహం లభ్యం

image

గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్‌లో శుక్రవారం యువకుడి మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై రమేశ్ నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ .. స్థానికులు మృతదేహాన్ని గుర్తించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేశామన్నారు. మృతుడు పార్వతీపురం గ్రామానికి చెందిన అలావెళ్లి రాజాగా గుర్తించామన్నారు. మృతికి గల కారణాలు తెలియలేదన్నారు.

Similar News

News March 2, 2026

కామారెడ్డి: ‘ఆపరేషన్ కవచ్’ సక్సెస్

image

కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ సత్ఫలితాలను ఇస్తోంది. రామారెడ్డి(M) పోసానిపేట వాసి పెంటయ్య ట్రాక్టర్‌ను నిందితులు దొంగిలించి బాన్సువాడలో విక్రయించేందుకు తరలిస్తుండగా ఆదివారం పద్మాజీవాడి X రోడ్డు వద్ద ‘ఆపరేషన్ కవచ్’ తనిఖీల్లో భాగంగా గాంధారి SI ఆంజనేయులు అడ్డుకున్నారు. నిందితులు గండ్ర స్వామి, వడ్ల విజయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.

News March 2, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 2)

image

* 1933: బాలీవుడ్ సంగీత దర్శకుడు పద్మశ్రీ ఆనంద్‌జీ వీర్జీ షా జననం
* 1936: రంగస్థల నటుడు అబ్బూరి గోపాలకృష్ణ జననం
* 1962: తెలంగాణ కవి యాకూబ్ జననం
* 1938: నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు మరణం
* 1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత కోకిల సరోజిని నాయుడు మరణం (ఫొటోలో)
* 1990: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా మంత్రి మసూమా బేగం మరణం

News March 2, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.