News August 4, 2024

తోటి సిబ్బంది ఆదుకోవడం అభినందనీయం: ఎస్పీ

image

విజయనగరం జిల్లాలో పోలీస్ శాఖలో పనిచేస్తూ ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలకు తోటి సిబ్బంది అండగా నిలిచారు. వారి ఒకరోజు వేతనాన్ని జమచేసి ఎస్పీ వకుల్ జిందాల్ చేతులమీదుగా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అందే సాయం కోసం వేచి చూడకుండా తోటి అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదుకోవడం అభినందనీయమని అన్నారు.

Similar News

News September 10, 2024

ఐటీఐ అభ్యర్థులకు దుబాయ్‌లో ఉద్యోగావకాశాలు

image

విశాఖ కంచరపాలెం ప్రభుత్వ ITIలో ఈ నెల 12న ఉదయం 9 గంటల నుంచి అశోక్ లేలాండ్ కంపెనీ వారిచే జాబ్ ఫేర్ నిర్వహిస్తున్నట్లు విజయనగరం ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ టి.వి.గిరి మంగళవారం తెలిపారు. ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో పెయింటర్ ట్రేడ్లలో ITI పాసైన వారు అర్హులు. దుబాయ్‌లో ఉద్యోగావకాశం ఉంటుందన్నారు. వివరాలకు 9440197068, 9849118075 నంబర్‌లను సంప్రదించాలన్నారు.

News September 10, 2024

ప్రజలు LHMS సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: ఎస్పీ

image

విజయనగరం పట్టణం, రూరల్ స్టేషన్లతో పాటు నెల్లిమర్ల, బొబ్బిలి పోలీసు స్టేషన్ పరిధిలోని మున్సిపల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు LHMS (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తమ అవసరాల నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో తమ ఇండ్లలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఇది పనిచేస్తోందని తెలిపారు.

News September 10, 2024

పుష్పాలంకరణలో శ్రీ పైడితల్లి అమ్మవారు

image

విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లమ్మకు చదురుగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడంతో ఆలయ అర్చకులు వేకువజాము నుంచి పంచామృతాభిషేకాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.