News January 4, 2025

తోపుదుర్తి చందశేఖర్ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు

image

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందశేఖర్ రెడ్డిపై టీడీపీ నేతలు పరశురామ్, విజయకుమార్ జిల్లా ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో చంద్రబాబు, నారా లోకేశ్‌‌ను దూషిస్తూ వ్యక్తిగతంగా దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజే అనుకొని ఉండుంటే మొద్దు శ్రీనుతో లోకేశ్‌ని చంపించేవాడని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిపారు.

Similar News

News January 16, 2025

కశ్మీర్‌లో ప్రాణాలొదిలిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్

image

ధర్మవరానికి చెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకట రమణారెడ్డి (40) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కశ్మీర్ బార్డర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో గుండెపోటుకు గురై మృతి చెందారు. ఇవాళ మృతదేహాన్ని బసినేపల్లికి తీసుకురానున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

News January 16, 2025

అనంతపురంలో ‘డాకు మహారాజ్‌’ విజయోత్సవ వేడుక!

image

హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈనెల 12న రిలీజైన ఈ మూవీ తొలిరోజే రూ.56కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీ విజయోత్సవ వేడుకలను అనంతపురంలో నిర్వహించేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి ఘటన కారణంగా అనంతలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో విజయోత్సవ వేడుకలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

News January 16, 2025

పెనుకొండ దారుణ ఘటన.. 22 మందిపై కేసు

image

ప్రేమికులు పారిపోవడానికి సహకరించిందన్న నెపంతో మహిళను వివస్త్రను <<15165737>>చేసి<<>> జుట్టు కత్తిరించిన ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో జరిగిన ఈ దారుణ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు 22 మందిపై కేసు నమోదు చేసినట్లు కియా పోలీసులు తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు.