News April 10, 2025

తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కేసు నమోదు

image

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగన్ పర్యటన వేళ వైసీపీ కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టడం, హెలిపాడ్ చుట్టూ బారికేడ్ల ఏర్పాటులో తోపుదుర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News February 27, 2026

విపక్షాలే టార్గెట్‌గా సీబీ‘ఐ’.. ఆరోపణలకు బలం చేకూరిందా?

image

విపక్షాలను టార్గెట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం CBI, EDలను వాడుకుంటోందనేది ఎంతో మంది ఆరోపణ. అక్రమ కేసుల్లో ఇరికించి నాయకుల క్రెడిబిలిటీని నాశనం చేయడం, జైలుకు పంపడమే లక్ష్యమన్న విమర్శలున్నాయి. ఈ వాదనలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తీర్పుతో బలం చేకూరిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆధారాల్లేకుండానే కేసు నమోదు చేసినందుకు CBI అధికారులపైనే విచారణ చేయాలని కోర్టు చెప్పడమే నిదర్శనమంటున్నారు.

News February 27, 2026

SRD: ఎలుకల మందు తాగి పారిపోయాడు!

image

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న అనిల్ (28) అనే ఆటో డ్రైవర్ పటాన్‌చెరు జేపీ కాలనీలోని తన నివాసంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెట్టింగ్ నష్టంతో మద్యం తాగి భార్యతో గొడవపడిన అతను, మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. పోలీసులు వచ్చేలోపే పారిపోయిన అనిల్‌ను, అరగంట తర్వాత అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.

News February 27, 2026

HYD: జరిగింది సరే.. ఎవరు బాధ్యత వహిస్తారు..?

image

దాదాపు 30% డిజిటల్ మీటర్లు పనిచేయడం లేదని స్వయంగా హైదరాబాద్ మహానగర జలమండలి అధికారులే క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. మీటర్లు రీడింగ్ చూపించకపోవడం వల్ల వినియోగదారులకు ‘లాక్డ్ రీడింగ్’ (Locked Reading) పడటం లేదు. దీంతో వచ్చే అదనపు ఆదాయం బోర్డుకు వెళ్తున్నా, మీటర్ల కొనుగోళ్లలో జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు..?