News April 10, 2025

తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కేసు నమోదు

image

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగన్ పర్యటన వేళ వైసీపీ కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టడం, హెలిపాడ్ చుట్టూ బారికేడ్ల ఏర్పాటులో తోపుదుర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News November 13, 2025

భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్టు: సీఐ

image

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో భార్య రత్నమ్మపై హత్యాయత్నం చేసిన ఆమె <<18270800>>భర్త<<>> ఎర్రి స్వామిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఎర్రి స్వామి కత్తితో రత్నమ్మ గొంతు కోయడానికి యత్నించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు రూరల్ సీఐ హరినాథ్ తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News November 12, 2025

గుత్తిలో వ్యక్తి మృతి

image

గుత్తిలోని కర్నూల్ రోడ్డులో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ ఆవరణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 12, 2025

శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలి: ఎస్పీ

image

శాంత్రిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీలేకుండా పనిచేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసుల ఛేదనకు టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులపై అలసత్వం వహించకుండా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు.