News March 28, 2024
తోలిసారి కోమటిరెడ్డి కుటుంబం కాకుండా..
కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించింది. 2009లో భువనగిరి నుంచి కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి పోటీ చేసి CPMఅభ్యర్థి నోముల నర్సింహయ్యపై గెలుపొందారు. 2014లో TRS అభ్యర్థి బూర నర్సయ్యపై ఓడిపోయారు. 2019లో వెంకట్‌రెడ్డి నర్సయ్యపై గెలుపొందారు. ఈ నియోజకవర్గానికి నాలుగోసారి ఎన్నికలు జరుగుతుండగా.. కోమటిరెడ్డి కుటుంబం కాకుండా వేరే వ్యక్తి పోటీ చేస్తుండటం గమనార్హం.
Similar News
News January 18, 2025
NLG: రేషన్ కార్డు లేని కుటుంబాలు 27,527
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. రేషన్ కార్డుల సర్వేపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు. కులగణన సర్వే రిపోర్టు ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో తయారు చేసిందని తెలిపారు. జిల్లాల్లో 27,527 రేషన్ కార్డుల లేని కుటుంబాలు ఉన్నట్లు లెక్క తేలిందని తెలిపారు.
News January 18, 2025
NLG: నేడు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష
ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ (ఆరో తరగతి) ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. NLG జిల్లాలో 13, BNGలో 5, SRPT జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో 80 సీట్లు ఉన్నాయనీ ప్రిన్సిపాల్ నాగభూషణం తెలిపారు. 80 సీట్లలో 75% గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.
News January 18, 2025
ఈ నెల 21న నల్గొండకు కేటీఆర్
నల్గొండకు ఈ నెల 21 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాసభలో పాల్గొననున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ ఓటమి తరువాత నల్గొండ టౌన్‌కు కేటీఆర్ రావడం ఇదే మొదటిసారి. కాగా ఈ నెల 13న నిర్వహించాల్సిన రైతు మహాసభ వివిధ కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.