News June 11, 2024
త్రిపురాంతకం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

త్రిపురాంతకం మండలం కేసినేనిపల్లి ఫ్లైఓవర్ వద్ద లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి ఆర్మీ జవాన్ ఓబులేసు (35)గా పోలీసులు గుర్తించారు. ఇతడిది పోరుమామిళ్ల గ్రామమని, బంధువులకు సమాచారం అందించినట్లు
ఎస్సై సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
ప్రకాశం: 22న జిల్లా స్థాయి హాకీ జట్ల ఎంపికలు.!

ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22న సంతనూతలపాడు మండలంలోని మైనంపాడులో గేమ్స్ జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా జూనియర్ బాల,బాలికల హాకీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షు, కార్యదర్శులు ఏవి.రమణారెడ్డి, ఏ. సుందరరామిరెడ్డి తెలిపారు. హాకీపట్ల ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలతో రావాలని పేర్కొన్నారు.
News March 20, 2025
కనిగిరి: బాలికలపై వేధింపులు.. టీచర్ అరెస్టు

కనిగిరిలోని బాలికోన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రంగారెడ్డిని విద్యాశాఖ ఉన్నతాధికారులు బుధవారం విధుల నుంచి తొలగించారు. పాఠశాలలో కొందరు బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేయడంతో నిన్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని కఠినంగా శిక్షించాలని ఆందోళనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆయనను విధులనుంచి తొలగించారు.
News March 20, 2025
కందికి మద్దతు కల్పిస్తాం: ప్రకాశం కలెక్టర్

ప్రకాశం జిల్లాలో రైతులు పండించిన కంది పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మర్రిపూడి మండలం చిమటలో ఏర్పాటు చేసిన కందుల సేకరణ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కందులను కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 126 మెట్రిక్ టన్నుల కందులను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశామన్నారు. చిమటలో 35 టన్నుల కందిని రైతులు దగ్గర నుంచి కొనుగోలు చేశామన్నారు.