News February 25, 2025
త్రిపురారం: గవర్నర్‌ని కలిసిన వస్రాం నాయక్

త్రిపురారం మండలం మాటూరుకి చెందిన భారత దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుడు ధనావత్ వస్త్రం నాయక్, NTA ప్రతినిధి ధనావత్ జగదీష్ నాయక్‌తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంగళవారం కలిశారు. వస్రాం నాయక్‌కి ఆటలపై మక్కువ పెరగడానికి గల కారణాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రచారం చేయాలని, భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు.
Similar News
News March 15, 2025
NLG: తూకాల్లో మోసం.. కొలతల్లో వ్యత్యాసం!

జిల్లాలో ప్రజలు నిత్యం నిలువు దోపిడికి గురవుతున్నారు. కొన్ని వాణిజ్య, వ్యాపార సంస్థలు తూకాల్లోనే కాదు.. వివిధ రకాల మోసాలకూ పాల్పడుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి రకరకాల తిరకాసులతో వినియోగదారులను నిండా ముంచుతున్నారు. ఏడాది కాలంలో జిల్లాలో తూనికల కొలతల శాఖ అధికారులు 371 కేసులు నమోదు చేశారు. ఇందులో 96 కేసులు తప్పుడు తూకాలకు సంబంధించినవి కావడం గమనార్హం.
News March 15, 2025
NLG: కృత్రిమ మేధాతో బోధన.. నేటి నుంచి ప్రారంభం

నల్గొండ జిల్లాలో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో నేటి నుంచి కృత్రిమ మేధాతో బోధన ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లో 14 పాఠశాలలను ఎంపిక చేశారు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాయంతో ప్రాథమిక విద్య బలోపేతం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చదువులో వెనుకబడిన పిల్లల కోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ బోధన చేపట్టనున్నారు.
News March 15, 2025
గుర్రంపూడ్: గ్రూప్-3లో మెరిసిన కానిస్టేబుల్

గుర్రంపూడ్ మండలం కొప్పోల్ గ్రామానికి శంకర్ గ్రూప్ -3లో మెరిశాడు. శంకర్ ప్రస్తుతం సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ.. కష్టపడి చదివి గ్రూపు-3 కి ఎంపికయ్యాడు. ఇటీవల విడుదలైన గ్రూపు-2 ఫలితాలలో 674వ ర్యాంక్, గ్రూప్ -3 ఫలితాలలో 165వ ర్యాంకు సాధించాడు. దీంతో శంకర్‌కు అభినందనలు వెల్లువెత్తాయి