News September 15, 2024
త్రిపురారం: మాజీ ఎంపీపీ భర్తపై కత్తితో దాడి

త్రిపురారం మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ భర్త అనుముల శ్రీనివాస్ రెడ్డిపై ఆదివారం సాయంత్రం ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. తాగిన మైకంలో ఉన్న యువకుడు ఓ విషయంలో న్యాయం చేయలేదంటూ శ్రీనివాస్ రెడ్డి పై దాడి చేయడంతో కడుపులో రెండు చోట్ల గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదు తరలించారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 27, 2025
ధాన్యం తడవడంపై నల్గొండ కలెక్టర్ ఆగ్రహం

వర్షాకాల ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. కనగల్ మండలం పగిడిమర్రిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సోమవారం తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడవటంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వహణలో లోపాల కారణంగా, సంబంధిత ఏపీఎం, సెంటర్ ఇన్ఛార్జిలకు ఆమె తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
News October 27, 2025
నల్గొండ: మహిళలకు గుడ్ న్యూస్

నల్గొండ శివారు రాంనగర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ స్త్రీలకు టైలరింగ్లో 31 రోజుల ఉచిత శిక్షణ ఇస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, భోజనం వసతి, షెల్టర్ ఇస్తామన్నారు. 18 సం. నుంచి 45 లోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 27, 2025
NLG: జిల్లాలో మొంథా అలజడి

జిల్లాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మొంథా తుపాను ముంచుకొస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలు, ఈదురు గాలులు కారణంగా వందల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. శాలిగౌరారం మండలంలో ఏకంగా రోడ్డు తెలిపోయింది.


