News September 12, 2024
త్రిబుల్ ఆర్ భూ బాధితులకు ఊరట
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం కోసం భూములు కోల్పోనున్న రైతులకు కొంత ఊరట లభించే విధంగా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రింగ్ రోడ్డు కోసం సేకరించే భూముల విలువను పెంచే ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. ఈ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్ విలువ 60 శాతం నుంచి 120 శాతం వరకూ పెంచేందుకు ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేసి నేషనల్ హైవే అథారిటీకి పంపారు.
Similar News
News October 16, 2024
‘కళాశాలల యాజమాన్యాలు సంయమనంతో వ్యవహరించాలి’
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల ఆలస్యాన్ని పేర్కొంటూ MG యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపు ఇచ్చిన దృష్ట్యా రిజిస్ట్రార్ ఆచార్య ఆలువాల రవి స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాల యాజమాన్యాలు సంయమనంతో స్పందించాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించడంలో కళాశాల కృషిని గుర్తు చేస్తూ మునుముందు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు.
News October 15, 2024
నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం
నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం 61,440 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. అవుట్ ఫ్లో 40,912 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.00 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 TMCలు కాగా ప్రస్తుతం నీటి నిలువ సామర్థ్యం 307.2834 TMCలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News October 15, 2024
భువనగిరి: ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ
మహారాష్ట్ర ,ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ముంబైలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రమేశ్ చేన్నితల, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలే ఆధ్వర్యంలో జరుగుతున్న ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుల సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వంశీ చందర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.