News June 12, 2024

త్రిబుల్ ఐటీలకు 48 వేల దరఖాస్తులు

image

ఏపీలోని నాలుగు ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎప్పటి వరకు 48 వేల దరఖాస్తులు అందినట్లు అడ్మిషన్లు కన్వీనర్ ఆచార్య గోపాలరాజు తెలిపారు. ఈనెల 25 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు ఐటీలలో కలిపి ఈ డబ్ల్యూ‌ఎస్ కోట కలిపి 4400 సీట్లు ఉన్నట్లు చెప్పారు. ఎంపికైన అభ్యర్థులు జాబితాలో జూలై 11న విడుదల చేస్తామని వివరించారు.

Similar News

News March 20, 2025

కృష్ణా జిల్లాలో ఇద్దరు ఇన్విజిలేటర్లు సస్పెండ్ 

image

పదో తరగతి పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తాడిగడప ఎంపీపీ ఎస్ మెయిన్ పాఠశాల ఇన్విజిలేటర్‌‌ను డీఈవో రామారావు సస్పెండ్ చేశారు. గైర్హాజరైన విద్యార్థి స్థానంలో మరొకరు పరీక్ష రాయడాన్ని గమనించకుండా బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో ఈ చర్య తీసుకున్నారు. కంకిపాడులో ప్రశ్నపత్రం మార్పిడి ఘటనలో మరో ఇన్విజిలేటర్‌ను కూడా సస్పెండ్ చేశారు.

News March 19, 2025

కృష్ణా: 10వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతం

image

10వ తరగతి పరీక్షల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 21,504 మంది విద్యార్థులకు గాను 21,026 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరు శాతం 97.78% నమోదైంది. 33 పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ అధికారులు తనిఖీ చేయగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని డీఈఓ రామారావు తెలిపారు. 

News March 19, 2025

బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధమవ్వండి: కలెక్టర్

image

మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. త్వరలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్‌పై బుధవారం తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గతంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో చర్చించి త్వరలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ తేదీలను ప్రకటిస్తామన్నారు. 

error: Content is protected !!