News August 14, 2024
త్రివర్ణ కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ బిల్డింగులు విద్యుత్ కాంతులతో త్రివర్ణ పతాక రంగులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ త్రివర్ణ పతాక విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అందరూ సంసిద్ధం అవుతున్నారు.
Similar News
News November 8, 2025
వంద శాతం దీపం కనెక్షన్లు ఇచ్చాం: బాబు

1,291 కుటుంబాలకు LPG కనెక్షన్లు ఇచ్చామని CM చంద్రబాబు తెలిపారు. 37,324 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, 42,232 మంది విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం అందించామన్నారు. P4 కింద 7,401 బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చేశామని చెప్పారు. 7,489 SC, ST కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు ఈ నెలాఖరుకు పూర్తవుతుందన్నారు. 5 లక్షల లీటర్ల పాలు కుప్పంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతోందని ఇది 10 లక్షలకు చేరాలని కోరారు.
News November 8, 2025
చిత్తూరు: జర్నలిజం పేరుతో వేధింపులు తగదు

జర్నలిజం పేరుతో అధికారులను వేధించడం తగదని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసే విలేకరులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలలో సిబ్బంది నిర్భయంగా పనిచేసుకునే వాతావరణం కల్పించడం తన బాధ్యతని పేర్కొన్నారు. ఇద్దరు పాత్రికేయులు మహిళా ఉద్యోగులను బెదిరించిన సంఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిని విచారించి ఒకరి అక్రిడేషన్ రద్దు చేశామన్నారు.
News November 8, 2025
కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన

కుప్పం నియోజకవర్గంలో ఏడు పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి శనివారం సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. సుమారు రూ.2200 కోట్ల పెట్టుబడితో 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏడు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని అన్నారు. దీనికి సంబంధించి శనివారం అమరావతి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.


