News January 26, 2025
త్రివర్ణ శోభతో జంట నగరాలు

గణతంత్ర దినోత్సవం రైల్వే స్టేషన్‌లకు కొత్త శోభను తెచ్చిపెట్టింది. నిన్న సికింద్రాబాద్ రైల్ నిలయం, సికింద్రాబాద్ సౌత్ సెంటర్ రైల్వే స్టేషన్‌లను 3 రంగుల జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలతో చూడ ముచ్చటగా అలంకరించారు. అలాగే నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేష త్రివర్ణ శోభతో జిగేల్ మంటున్నాయి. ఈ అలంకరణ ప్రయాణికులను ఆకట్టుకుంది.
Similar News
News February 19, 2025
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 132 పాయింట్లు తగ్గి 75,835 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు తగ్గి 22,890 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీ టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతుండగా HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
News February 19, 2025
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి ఇతర ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగు, తాగునీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన, రైతు భరోసా, యూరియా కొరతపై కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.
News February 19, 2025
జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత

వేసవి నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం జిల్లాలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 36.2℃ గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో సరాసరి 21.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.