News January 26, 2025
త్రివర్ణ శోభతో జంట నగరాలు

గణతంత్ర దినోత్సవం రైల్వే స్టేషన్లకు కొత్త శోభను తెచ్చిపెట్టింది. నిన్న సికింద్రాబాద్ రైల్ నిలయం, సికింద్రాబాద్ సౌత్ సెంటర్ రైల్వే స్టేషన్లను 3 రంగుల జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలతో చూడ ముచ్చటగా అలంకరించారు. అలాగే నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేష త్రివర్ణ శోభతో జిగేల్ మంటున్నాయి. ఈ అలంకరణ ప్రయాణికులను ఆకట్టుకుంది.
Similar News
News November 23, 2025
GWL: సత్య సాయి సేవ మార్గం అందరికీ ఆదర్శం- ఎస్పీ

సత్య సాయి బాబా సేవా మార్గం అందరికీ ఆదర్శమని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన 100వ జయంతి సందర్భంగా గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సత్యసాయి జయంతి అంటే కేవలం పుట్టినరోజు కాదని మనం చేసే సేవా, ప్రేమ, సత్యం, నీతి, శాంతి అహింస వంటి విలువలను జీవితంలో అమలు చేసే రోజు అన్నారు. ఆయన ఆశీస్సులు అందరిపై ఉండాలని ఉండాలని ఆకాంక్షించారు.
News November 23, 2025
నిరుద్యోగ యువతకు ఈ సంస్థ గురించి తెలుసా.?

గ్రామీణ నిరుద్యోగ యువతకు వెంకటాచలంలో ఉన్న స్వర్ణభారత్–సోమా సాంకేతిక శిక్షణా సంస్థ ఓ ఆశాదీపంగా నిలిచింది. డిమాండ్ ఉన్న రంగాలలో సాంకేతిక నిపుణులతో ఉచిత శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. గడచిన 14 ఏళ్లలో 5,420 మంది ఇక్కడ శిక్షణ పొందగా 80% మందికి పైగా యువకులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. శిక్షణ పొందే వారికి ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తున్నారు.
News November 23, 2025
ప్రొద్దుటూరులో అప్పులోళ్ల ఆందోళన..!

ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి శ్రీనివాసులు కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఆభరణాల తయారీకి ఆర్డర్లు ఇచ్చామని పలువురు చెప్పుకొచ్చారు. అడ్వాన్స్లు కూడా ఇచ్చామని, ఇతను పెద్ద మొత్తంలో చీటీలు నిర్వహిస్తున్నాడని తెలిపారు. దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుందని బాధితులు వాపోతున్నారు. ఆయన జైలుకు పోతే తమ డబ్బులు రావేమోనని భయపడిపోతున్నారు. తమ డబ్బులు కూడా పోలీసులే వసూలు చేయించాలని కోరుతున్నారు.


