News August 30, 2024

త్రివిధ దళాల్లో అనుశక్తి మరింత బలోవపేతం: కేంద్ర మంత్రి

image

వివిధ దళాల్లో అను శక్తి మరింత బలోపేతం చేయనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. గురువారం ఆయన INS హరి ఘాత అనే జలాంతర్గామిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంకేతిక వ్యవస్థలను మన శక్తి సామర్థ్యాలను శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనంగా నిలిచిందని అన్నారు. ఈ జలాంతర్గామి దేశం సాధించిన మరో ప్రగతి అని ప్రశంసించారు.

Similar News

News February 10, 2025

విశాఖ: నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఈరోజు ఆఖరి రోజు కాగా ఇప్పటివరకు 8మంది నామపత్రాలు సమర్పించారు. సోమవారం ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ఈనెల 11న చేస్తారు. 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

News February 10, 2025

విశాఖలో పోలీస్ అధికారులతో సమీక్ష చేసిన డీజీపీ

image

విశాఖలో పోలీసుల పనితీరు చాలా బాగుందని క్రైమ్ రేట్ పెరగకూడదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలు విని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్‌తో పాటు డీసీపీలు పాల్గొన్నారు.

News February 9, 2025

విశాఖ: సముద్రంలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

image

విశాఖకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్ర తీరంలో ఆదివారం మృతిచెందారు. మృతులు కంచరపాలేనికి చెందిన మొక్క సూర్యతేజ, దువ్వాడకు చెందిన మొక్క పవన్‌గా గుర్తించారు. రాంబిల్లి బీచ్‌లో స్నానం చేయడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!