News February 6, 2025
త్రివేణీ సంగమంలో నంద్యాల ఎంపీ పుణ్య స్నానం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఇక్కడ పవిత్ర స్నానం ఆచరించడం తన పూర్వ జన్మ సుకృతం అని ఆమె తెలిపారు. అక్కడ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఈ మహా కుంభమేళాకు జిల్లా నుంచి సైతం భక్తులు తరలివెళ్తున్నారు.
Similar News
News February 6, 2025
భద్రాద్రి: 38,536 మందికి రైతు భరోసా నిధులు జమ
తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాకు కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాలు, గ్రామాల వారీగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. భద్రాద్రి జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న 38,536 మంది రైతుల ఖాతాలలో రూ.45,683,6754 జమయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తుండగా, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.
News February 6, 2025
NZB: జూనియర్ కళాశాలను DIEO తనిఖీ
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ గర్ల్స్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి (DIEO) రవి కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో జియో ట్యాగింగ్ చేయాలని, కెమెరాలు పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా పరీక్షలు జరుగుతున్న మరికొన్ని కళాశాలలను ఆయన తనిఖీ చేశారు.
News February 6, 2025
SKLM: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్సై సందీప్ వివరాల మేరకు.. బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని చౌదరి సత్యనారాయణ కాలనీకి చెందిన తరుణ్ (19), పాజిల్ బేగ్ పేటకు చెందిన కార్తీక్ (21) బైక్‌పై వస్తూ డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.