News February 5, 2025
త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు రూ. 1 కోటి, ధృతి కేసరికి రూ. 10 లక్షలు, హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి తలా రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం త్రిషను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 14, 2025
‘జూబ్లీహిల్స్‌లో BRS గెలిస్తే NEXT CM KCR’

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను BRS ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిస్తే మళ్లీ తిరిగి కారు ఫామ్‌లోకి వస్తుందని, 100 స్పీడ్‌లో దూసుకెళ్తుందని BRS నేతలు అంటున్నారు. ఇటీవల KTR మాట్లాడుతూ.. 2028లో KCR CM కావడానికి జూబ్లీహిల్స్ నుంచే జైత్ర యాత్ర మొదలు పెట్టాలని ఓటర్లను రిక్వెస్ట్ చేశారు. దీంతో ‘జూబ్లీహిల్స్‌లో BRS గెలిస్తే NEXT CM KCR’ అంటూ ఆ పార్టీ శ్రేణులు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నాయి. మీ కామెంట్?
News October 14, 2025
HYD: ‘కాంగ్రెస్ గెలిస్తే జూబ్లిహిల్స్‌పై వరాల జల్లు’

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అటు BRSతోపాటు ఇటు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడి ఫలితాల ప్రభావం ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లపై ఉంటుందని, క్షేత్రస్థాయిలో నాయకులు పర్యటించి కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించేలా చూడాలని ఇప్పటికే CM రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. కాంగ్రెస్ గెలిస్తే జూబ్లిహిల్స్‌పై CM వరాల జల్లు కురిపిస్తారంటూ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నాయి. దీనిపై మీ కామెంట్?
News October 14, 2025
హైదరాబాద్ వాతావరణ సమాచారం

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో నేడు ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని, ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీయవచ్చని చెప్పింది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది.