News September 20, 2024
త్రిసభ్య కమిటీలో కోరుట్ల ఎమ్మెల్యేకు చోటు

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపైన స్టడీ చేయడానికి త్రిసభ్య కమిటీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య అధ్యక్షతన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌లతో కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలోని పలు అసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక అందించనుంది.
Similar News
News September 19, 2025
KNR: పత్తి సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పత్తి కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారంసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 44,885 ఎకరాల్లో పత్తి సాగైందని, 5,38,620 క్వింటాళ్ల దిగుబడిని అంచనా వేశామని తెలిపారు. జిల్లాలో పత్తి పంట సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News September 19, 2025
KNR: ‘పాఠశాలల్లో విభిన్న పద్ధతుల్లో విద్యాబోధన’

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM) జిల్లాస్థాయి మేళాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విభిన్న పద్ధతులను అనుసరించి విద్యాబోధన చేస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులున్నారు.
News September 19, 2025
కరీంనగర్: చెత్త వేయకుండా ఇనుప జాలి ఏర్పాటు

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం, బస్టాండ్ వెనుక రోడ్డులో ప్రజలు చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు ఇనుప జాలిని ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని అధికారులు పదేపదే సూచించినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నగర పరిశుభ్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని అధికారులు కోరారు.