News March 18, 2025
త్రేతాయుగం నాటి ఆలయం.. మీరు వెళ్లారా..!

హీరో నితిన్ అశ్వారావుపేట సరిహద్దులో ఉన్న గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని స్థానికులు చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలు, గుబ్బలుగా ఉన్న గుహలో వెలవడంతో గుబ్బల మంగమ్మగా ప్రసిద్ధి చెందిందని అంటున్నారు. గిరిపుత్రులే పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయానికి అశ్వారావుపేట నుంచి పూచికపాడు, రామచంద్రాపురం మీదుగా వెళ్లొచ్చు.
Similar News
News March 18, 2025
Way2News Exclusive: టెన్త్ విద్యార్థులకు స్కామర్ల వల

AP: ఎలాగైనా టెన్త్ పాస్ కావాలనే విద్యార్థులను కొందరు దోచుకుంటున్నారు. డబ్బులిస్తే జరగబోయే పరీక్షల క్వశ్చన్ పేపర్లు పంపుతామని టెలిగ్రామ్ ఛానళ్లలో వల వేస్తున్నారు. దీంతో అమాయక స్టూడెంట్స్ పేమెంట్స్ చేస్తే ప్రొటెక్టెడ్ PDF పంపి, పాస్‌వర్డ్ కోసం మళ్లీ డబ్బు లాగుతున్నారు. ఇలాంటి స్కామర్లలో ఒకరితో స్టూడెంట్‌లా Way2News చాట్ చేసింది (పైన చాట్ ఫొటోలు). విద్యార్థులూ.. ఇలాంటి స్కామర్లను నమ్మకండి.
Share It
News March 18, 2025
మార్టూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

మార్టూరు జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఓ కారు టైరు పగిలి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. మరో ముగ్గురుకి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 18, 2025
తిరుపతి జిల్లాలో మైక్రో ఇరిగేషన్ సాగు ఎంతంటే?

తిరుపతి జిల్లాలో మైక్రో ఇరిగేషన్ అమలు, పురోగతి, లబ్ధిదారుల వివరాలు, సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత ప్రోత్సాహం గురించి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంట్‌లో మంగళవారం ప్రశ్నించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం 2015-16 నుంచి అమలులో ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 96.97 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మైక్రో-ఇరిగేషన్ చేపట్టారని తెలిపారు.