News January 6, 2025
త్వరలోనే చర్యలు తీసుకుంటాం: HYDRA కమిషనర్

ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని హైడ్రా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా నేడు హైడ్రా కార్యాలయంలో చీఫ్ ఫిర్యాదులు తీసుకున్నారు. తొలిరోజే ప్రజలు ఫిర్యాదులతో హైడ్రా కార్యాలయానికి పోటెత్తారు. మొదటి రోజు 83 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైడ్రా ప్రజావాణి కొనసాగింది.
Similar News
News October 23, 2025
హైదరాబాద్‌లో చలి షురైంది!

HYD నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో చలి మొదలైంది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో చలి నెమ్మదిగా పెరుగుతోంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. పగటి కాలం సంకుచితమై, సాయంత్రం 6 గంటలకు సూర్యాస్తమయం జరుగుతోంది. ప్రజలు చలి నుంచి రక్షణకు స్వెటర్లు, రగ్గులను సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో జనాలు ఇప్పటికే చలి నివారణ కోసం మంటలను వెలిగించి కాపుకుంటున్నారు. మరి మీ ఏరియాలో చలి ఎలా ఉంది?
News October 22, 2025
BIG BREAKING: పోచారంలో కాల్పుల కలకలం

హైదరాబాద్ శివారులోని పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. బీజేపీ నేతలు తెలిపిన వివరాలు.. బహదూర్‌పురాకు చెందిన ఇబ్రహీం నాగారం మున్సిపాలిటీకి పరిధి రాంపల్లికి చెందిన సోనూ సింగ్‌పై యమ్నంపేట కిట్టి స్టీల్ కంపెనీ వద్ద కాల్పులు జరిపాడు. సోనూ పరిస్థితి విషమించడంతో మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు. కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 22, 2025
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్క్రూటినీ వేళ రిటర్నింగ్ ఆఫీస్ వద్ద కోలాహలం నెలకొంది. అభ్యర్థులు పోటీలో ఉంటారా? లేదా? అనే వెరిఫికేషన్ ఆసక్తిని పెంచింది. అభ్యర్థులు అయితే కాస్త టెన్షన్ పడ్డారు. సునీత నామినేషన్ రద్దు చేయాలని, నవీన్ యాదవ్ నామినేషన్ రద్దు చేయాలని SMలో ఇరు పార్టీల నేతలు పోస్టులు పెట్టారు. కానీ, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం తెలిపారు.