News July 26, 2024
త్వరలోనే వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి

గత ప్రభుత్వం NLG, SRPT, యాదాద్రిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసింది. SRPTలో భవనం పూర్తైనా NLG, యాదాద్రి జిల్లాలో పూర్తి చేయలేదు. ఈ బడ్జెట్లో వైద్య రంగానికి రూ.11,468 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో నల్గొండతో పాటు యాదాద్రిలో వైద్య కళాశాల భవనాల నిర్మాణం పూర్తి చేయనుంది. మరోవైపు జిల్లాలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేయనుంది.
Similar News
News November 28, 2025
నల్గొండ జిల్లాలో ఇవాళ్టి టాప్ న్యూస్

✓మర్రిగూడ: నగదు ఎలా స్వీకరిస్తున్నారు.. ఇలా త్రిపాఠి వాకబు
✓చెర్వుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు
✓చండూరు: కుల ధృవీకరణ కోసం పడిగాపులు
✓మిర్యాలగూడ: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
✓నల్గొండ: కుక్కల స్వైర విహారం.. 22 గొర్రెల మృతి
✓కట్టంగూరు: కాంగ్రెస్లో బయటపడ్డ వర్గ విభేదాలు
✓చిట్యాల: అప్పుడు వార్డు మెంబర్.. ఇప్పడు మండలి ఛైర్మన్
News November 28, 2025
దేవరకొండకు సీఎం రేవంత్

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి విచ్చేయనున్నారు. దీనిలో భాగంగా డిసెంబర్ 6వ తేదీన జిల్లాలోని దేవరకొండకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కాంగ్రెస్ నాయకులు సమీక్షించారు.
News November 28, 2025
నగదును ఎలా స్వీకరిస్తున్నారు?.. ఇలా త్రిపాఠి వాకబు

గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె మర్రిగూడ మండలం సరంపేట, శివన్నగూడెం, వట్టిపల్లి గ్రామాలలో పర్యటించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు సమర్పించే నగదును ఎలా స్వీకరిస్తున్నారని ? అలాగే వారికి రశీదు ఇస్తున్నారా? అని కలెక్టర్ సిబ్బందిని అడిగారు.


