News July 11, 2025

త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

image

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

Similar News

News August 31, 2025

రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా వేదిక: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో ఆదివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ప్రజా వేదికను వినియోగించుకోవాలని సూచించారు.

News August 31, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.122, మాంసం రూ.177 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.201 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News August 31, 2025

కుప్పంలో బుల్లెట్ బైక్ నడిపిన మంత్రి నిమ్మల

image

కుప్పంలో శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు బుల్లెట్ బైక్‌పై సీఎం బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. పరమసముద్రం వద్ద హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి ఇచ్చే బహిరంగ సభకు వెళ్లగా.. మంత్రి నిమ్మల బుల్లెట్ బైక్‌పై ఈ సమావేశానికి వచ్చారు. టీడీపీ శ్రేణులకు అభివాదం ఆయన చేశారు.