News January 25, 2025

త్వరలోనే YCPకి జగన్ గుడ్‌బై: కిరణ్ రాయల్ 

image

YCP అధినేత జగన్ ఓ మూర్ఖుడని, త్వరలోనే ఆయన పార్టీని వదిలి లండన్ వెళ్తారని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. ఆ పార్టీలో ముఖ్య నాయకులంతా ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డి లక్షల కోట్లు దోచుకుంటే, జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. త్వరలోనే YCP ఆఫీసుల వద్ద టూ లెట్ బోర్డులు కనిపిస్తాయన్నారు. VSR కూటమిలో చేరే ప్రయత్నం విఫలం కావడంతోనే YCPకి గుడుబై చెప్పారన్నారు.  

Similar News

News November 28, 2025

మంచిర్యాల జిల్లాలో సర్పంచి స్థానాలకు 99 నామినేషన్లు

image

మంచిర్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతోంది. శుక్రవారం 90 సర్పంచ్ స్థానాలకు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 816 వార్డులకు 222 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ, 11న పోలింగ్ జరగనుంది.

News November 28, 2025

MDK: రెండో రోజు 152 సర్పంచ్, 186 వార్డు నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల స్వీకరణలో సర్పంచ్ స్థానాలకు 152, వార్డు సభ్యుల స్థానాలకు 186 నామినేషన్లు వచ్చాయి. అల్లదుర్గ్ 14, హవేలీఘనపూర్ 49, పాపన్నపేట్ 25, రేగోడు 18, శంకరంపేట్(ఏ) 17, టేక్మాల్ 29 సర్పంచ్ నామినేషన్లు స్వీకరించారు. వివరాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.

News November 28, 2025

వనపర్తిలో 780 వార్డులకు 276 నామినేషన్లు

image

వనపర్తి జిల్లాలో మొదటి విడత జరగనున్న 87 గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని మొత్తం 780 వార్డులకు రెండు రోజుల్లో 276 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 250 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
మండలాల వారీగా వివరాలు:
ఘనపూర్: 90
పెద్దమందడి: 83
రేవల్లి: 51
గోపాల్‌పేట: 19
ఏదుల: 07